సీఎం వ్యాఖ్యలతో షాక్ తిన్న అధికారులు

Update: 2018-05-21 07:55 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. హైదరాబాద్ ను అన్నిరకాలుగా అభివృద్ధి చేసి ప్రపంచపటంలో పెట్టాననే ఆయన ఇప్పుడు అమరావతిని ప్రపంచశ్రేణీ నగరంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా రాత్రింబవళ్లు కష్టపడుతున్న ఆయన దృష్టి ఒక్కసారిగా అమరావతిలో ఉష్ణోగ్రతలపై పడింది. సోమవారం నీరు-ప్రగతి కార్యక్రమంపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. అమరావతిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఉష్ణోగ్రతలు తామెలా తగ్గించగలమో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంత పచ్చదనం పెంపొందించినా, ఎన్ని చర్యలు తీసుకున్నా ఉష్ణోగ్రతలు తగ్గించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు, అందునా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా 10 డిగ్రీలు తగ్గించడం అంటే ఎలా అని అధికారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.

Similar News