లాజక్ లేవనెత్తిన చంద్రబాబు

రెండు రోజుల్లో కౌంటింగ్ ఉందనగా వీవీప్యాట్ల లెక్కింపు కోసం విపక్ష పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో 21 పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర [more]

Update: 2019-05-21 10:59 GMT

రెండు రోజుల్లో కౌంటింగ్ ఉందనగా వీవీప్యాట్ల లెక్కింపు కోసం విపక్ష పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో 21 పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కపెట్టినప్పుడు తేడాలు వస్తే ఆ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని కోరారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కంటే ముందే ఈ ఐదు వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని వినవించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… రక్తపరీక్షలో ఏదైనా జబ్బు ఉందని తేలితే మొత్తం స్కానింగ్ చేయించుకుంటామని, ఇక్కడ కూడా 5 వీవీప్యాట్ల లెక్కింపులో తేడాలు ఉంటే మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని అన్నారు. అన్ని వీవీప్యాట్లను లెక్కించడానికి ఎన్నికల సంఘానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. ప్రజల తీర్పును మానిప్యులేట్ చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

Tags:    

Similar News