రాళ్ల సీమను రతనాల సీమగా మారుస్తాం

రాళ్ల సీమగా ఉన్న రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం కియా పరిశ్రమతో తొలి అడుగు పడిందన్నారు. మంగళవారం ఆయన అనంతపురంలో [more]

Update: 2019-01-29 07:46 GMT

రాళ్ల సీమగా ఉన్న రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం కియా పరిశ్రమతో తొలి అడుగు పడిందన్నారు. మంగళవారం ఆయన అనంతపురంలో కియా మోటర్స్ తొలి కారును విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… తన జీవితంలోనే ఇది ఆనందకరమైన రోజని, పరిశ్రమలు రావడం లేదని తన బాధను కియా కంపెనీ తొలగించిందన్నారు. ఈ సంస్థ ద్వారా అనంతపురం జిల్లాలో 4 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 7 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కియా కార్లకు భారత్ అతిపెద్ద మార్కెట్ గా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సౌత్ కొరియాకు, ఆంధ్రప్రదేశ్ కు చాలా పోలికలు ఉన్నాయని, జనాభా, విస్తీర్ణం కూడా ఇంచుమించు సమానమేనన్నారు. కొరియా నుంచి మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తామన్నారు.

Tags:    

Similar News