ఆంధ్రప్రదేశ్ కు మరో షాక్ ఇచ్చిన కేంద్రం

Update: 2018-07-12 13:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హైకోర్టు విషయంలో కేంద్ర న్యాయ శాఖ ఆంధ్రప్రదేశ్ కి షాక్ ఇచ్చింది. హైకోర్టు ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే కీలక బాధ్యత అని, హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాలు, మౌలిక సధుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని తెలిపింది. హైకోర్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ లో భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసిన తర్వాత ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకు తెలపాలని, తర్వాత ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రత్యేక హైకోర్టు కావాలని అడిగితే కేంద్రం ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. విభజన చట్టంలో హైకోర్టు ఏర్పాటుకు తుది గడువు అంటూ ఏమీ చెప్పలేదని, కానీ, పదేళ్లు మాత్రం ఉమ్మడి హైకోర్టు నిర్వహణకు అవకాశం ఇచ్చిందని తేల్చింది. ఈ అఫిడవిట్ తో ప్రత్యేక హైకోర్టు బాధ్యత పూర్తిగా ఏపీ ప్రభుత్వంపై పెట్టేసింది కేంద్రం.

Similar News