బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వ చర్యలు భేష్.. ప్రశంసించిన కేంద్ర బృందం

ఏపీలో కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వైద్య పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. నేడు కర్నూలు జిల్లాలో [more]

Update: 2020-05-10 08:35 GMT

ఏపీలో కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వైద్య పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. నేడు కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. కర్నూలులో దాదాపు 566 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రత్యేకంగా కేంద్ర బృందం ఇక్కడ పర్యటిస్తోంది. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలను కర్నూలు జి్లా అధికారులకు వివరించారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వ్యూహం మార్చాలని కర్నూలు జిల్లా అధికారులకు కేంద్ర బృందం సూచించింది.

Tags:    

Similar News