వైఎస్సార్ కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన కేంద్రం

Update: 2018-07-17 08:02 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను వైఎస్సార్ కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పరిగణిస్తూ కేంద్రం ఆహ్వానించింది. బుట్టా రేణుక గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆమెను లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వైసీపీ నియమించింది. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడంతో, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ స్పీకర్ ను కోరిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక హోదా సాధన కోసం ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు పోనూ మిగతా ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యంతరం

అయితే, ఫిరాయింపు ఎంపీలైన ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీతపై చర్యలు తీసుకావాలని వైసీపీ తరచూ స్పీకర్ ను కోరుతోంది. అయినా చర్యలు తీసుకోని స్పీకర్...ఇప్పుడు బుట్టా రేణుకను వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా గుర్తింస్తూ ఆహ్వానించడంపై వైపీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభలో వైసీపీ నేత హోదాలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తారు. ఫిరాయింపు ఎంపీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Similar News