మిషన్ న్యూ ఎకనామి

బడ్జెట్ లో మిషన్ న్యూ ఎకానమినీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బేటీ పడావ్, బేటీ బచావ్ పథకం విజయవంతమయిందన్నారు. దేశ వ్యాప్తంగా బాలికల హాజరు అన్ని స్థాయిల్లో [more]

Update: 2020-02-01 07:23 GMT

బడ్జెట్ లో మిషన్ న్యూ ఎకానమినీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బేటీ పడావ్, బేటీ బచావ్ పథకం విజయవంతమయిందన్నారు. దేశ వ్యాప్తంగా బాలికల హాజరు అన్ని స్థాయిల్లో ఎక్కువగా ఉందని గణాంకాలతో నిర్మలా సీతారామన్ వివరించారు. లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోషకాహార పథకాలకు 36 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. సీనియర్ సిటిజన్ల కోసం 9,500 కోట్లు కేటాయించారు. టూరిజం ప్రమోషన్ కు 2,500 కోట్లు కేటాయింపులు జరిపారు. అవినీతి రహిత పాలనకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. జీ 200 సదస్సు నిర్వహణకు 200 కోట్లు కేటాయించారు. రాంచీలో ట్రైబల్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు.

పన్నుల వేధింపులుండవు….

పర్యాటక ప్రదేశాలకు తేజస్ తరహా రైళ్లను ప్రవేశపెడుతున్నామన్నారు. అత్యవసరసేవలకు డిజిటల్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్టార్టప్ ల కోసం డిజిటల్ ప్లాట్ ఫారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళకు చెందిన పథకాల కోసం 28,600 కోట్లు కేటాయింపులు జరిపారు. కాలుష్యానికి కారణమవుతున్న విద్యుత్తు ప్రాజెక్టులును మూసివేస్తామన్నారు. పన్నుల వేధింపులను ప్రభుత్వం సహించబోదన్నారు. లఢక్ అభివృద్ధికి 5958 కోట్లు కేటాయించారు. జమ్మూకాశ్మీర్ కోసం 37 వేల కోట్లు కేటాయింపులు జరిపారు. ఎస్సీలకు 85 వేల కోట్లు కేటాయించారు. పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

Tags:    

Similar News