కేంద్ర ప్రభుత్వం కీలకనిర్ణయం

వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపెనీలు తయారీకి ముందుకు [more]

Update: 2021-05-14 01:03 GMT

వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపెనీలు తయారీకి ముందుకు వస్తే ఫార్ములాను ఇచ్చేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ వ్యాక్సిన్ల దిగుమతికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్ లో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫైజర్, మెడెర్నా సంస్థలు తమ వ్యాక్సిన్ల ను పంపిణీ చేసేందుకు అనుమతి కోరాయని, ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే బిఎస్ఎల్ 3 ల్యాబ్ లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News