బ్రేకింగ్: కేసీఆర్ కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..?

Update: 2018-09-07 10:54 GMT

అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టంగా చెప్పారు. నవంబర్ లో ఎన్నికలు ఉంటాయని, డిసెంబర్ లో ఫలితాలు రావొచ్చని ఆయన ధీమాగా చెప్పారు. ఎన్నికల సంఘంతో కూడా తాము సంప్రదింపులు చేశామని చెప్పారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని అంటోంది. నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు జరపాలా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నిక సంఘం నుంచి నివేదిక అందాక, ఎన్నికల నిర్వాహణకు సన్నద్ధంగా ఉన్నామని చెపితేనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించగలమన్నారు. అయితే, ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కొనసాగవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కేసీఆర్ ప్రకటించడం దురదృష్టకరమన్నారు.

Similar News