సీబీఐ స్పెషల్ డ్రైవ్.. ఏకకాలంలో 11 రాష్ట్రాల్లో సోదాలు

బ్యాంకుల ముంచిన బడాబాబుల పై సీబీఐ కొరడా ఝళిపించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహించింది. మొత్తం 11 రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో వందల కోట్ల [more]

Update: 2021-03-28 01:15 GMT

బ్యాంకుల ముంచిన బడాబాబుల పై సీబీఐ కొరడా ఝళిపించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహించింది. మొత్తం 11 రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో వందల కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. 3700 కోట్ల రూపాయల స్కాం కు సంబంధించి ఈ సోదాలు చేసినట్లు సిబిఐ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. 11 రాష్ట్రాల్లో 100 ప్రదేశాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. రూ. 3,700 కోట్లకు పైగా బ్యాంకులను మోసగించిన వ్యవహారాల్లో 30 కేసులు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీబీఐ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో మోసాలకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫిర్యాదులిచ్చిన బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, ఐడీబీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఉన్నాయి.

Tags:    

Similar News