సీబీఐ సోదాలు అందుకేనా?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు మరోసారి సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పైన సీబీఐ కేసు నమోదు చేసింది. [more]

Update: 2020-12-18 08:50 GMT

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు మరోసారి సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పైన సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టారు అనే ఆరోపణలపై రాయపాటి సాంబశివరావు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలో రెండుసార్లు సీబీఐ అధికారులు సోదాలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించారు. మరోవైపు కంపెనీ సీఈఓగా పనిచేసిన శ్రీధర్ పైన నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రాయపాటి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ పైన అటు సీబీఐకి రాయపాటి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం… ఈ మేరకు రాయపాటి ఇల్లు, కార్యాలయం తో పాటుగా శ్రీధర్ ఇళ్లల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు నకిలీ పాస్ పోర్టు తో శ్రీధర్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాయపాటి సాంబశివరావు కుటుంబసభ్యులు సీబీఐకి సమాచారం ఇచ్చారు.

Tags:    

Similar News