టీవీ9 ర‌విప్ర‌కాష్ పై కేసు నమోదు

టీవీ9 ఛాన‌ల్ సీఈఓ, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ర‌విప్ర‌కాష్ పై కేసు న‌మోదైంది. ఫోర్జరీ సంత‌కం చేశార‌ని, సంస్థ నిధుల‌ను దారి మ‌ళ్లించార‌ని అలంద మీడియా సంస్థ ప్ర‌తినిధులు [more]

Update: 2019-05-09 07:22 GMT

టీవీ9 ఛాన‌ల్ సీఈఓ, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ర‌విప్ర‌కాష్ పై కేసు న‌మోదైంది. ఫోర్జరీ సంత‌కం చేశార‌ని, సంస్థ నిధుల‌ను దారి మ‌ళ్లించార‌ని అలంద మీడియా సంస్థ ప్ర‌తినిధులు ఇచ్చిన పిర్యాదు నేప‌థ్యంలో సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ర‌విప్ర‌కాష్ పై కేసు న‌మోదు చేసిన ఆయ‌న నివాసంలో సోదాలు జ‌రిపారు. టీవీ9 సంస్థ‌ను ఇటీవ‌ల అలంద మీడియా సంస్థ కొనుగోలు చేసింది. అయినా టీవీ9లో 9 శాతం వాటా క‌లిగిన ర‌విప్ర‌కాష్ టీవీ9పై త‌న పెత్త‌నం ఉండేలా ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో కొత్త డైరెక్ట‌ర్ల నియామ‌కానికి సంబంధించి త‌న సంత‌కాన్ని పోర్జ‌రీ చేశార‌ని అలంద మీడియా సంస్థ కార్యాద‌ర్శి కౌశీక్ రావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ర‌విప్ర‌కాష్ పై కేసు న‌మోదు చేయ‌డంతో పాటు ఆయ‌న‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ర‌విప్ర‌కాష్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పోలీసులు ఆయ‌న కోసం గాలిస్తున్న‌ట్లు స‌మాచారం. ర‌విప్ర‌కాష్ తో పాటు ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో అప్పుడ‌ప్పుడూ టీవీ9లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యే సినీ న‌టుడు శివాజీ ఇంట్లోనూ పోలీసులు సోదాలు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. టీవీ9 కార్యాల‌యంలో ప‌లు ఫైళ్లు, హార్డ్ డిస్క్ ల‌ను మాయం చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News