సెలెక్ట్ కమిటీపై ససేమిరా

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు పై రెండు పార్టీలు తమ వాదనలను సమర్థవంతంగా విన్పిస్తున్నాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా ప్రభుత్వం కావాలని అడ్డుకుంటోందని టీడీపీ సీనియర్ నేత [more]

Update: 2020-02-15 06:24 GMT

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు పై రెండు పార్టీలు తమ వాదనలను సమర్థవంతంగా విన్పిస్తున్నాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా ప్రభుత్వం కావాలని అడ్డుకుంటోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష‌్ణుడు ఆరోపించారు. శానసమండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం దానికి సమ్మతి తెలపలేదన్నారు. శాసనమండలి ఛైర్మన్ ను ప్రశ్నించే హక్కు సభ్యులకే లేదని, ఇక అధికారులకు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అధికారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.

ప్రభుత్వ వాదన మాత్రం?

మరోవైపు ప్రభుత్వం కూడా తన వాదనను సమర్థించుకుంటోంది. ఓటింగ్ జరగకుండా సెలెక్ట్ కమిటీని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తుంది. 14రోజులు గడిచినందున ఇక సెలెక్ట్ కమిటీ లేనట్లేనని తెలిపింది.ఆర్టికల్ 189 క్లాజు 1 ప్రకారం శాసనమండలి కార్యదర్శి నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని ప్రభుత్వం చెబుతోంది. రెండు కీలక బిల్లులపై ఆర్డినెన్స్ తేవాలా? లేదా గవర్నర్ వద్దకు పంపాలా? అన్న దానిపై వైసీపీ నేతలు ఆలోచనలో ఉన్నారు. సెలెక్ట్ కమిటీ కథ ఇక ముగిసినట్లేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News