బీజేపీ నేతల అరెస్ట్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమైన [more]

Update: 2020-09-11 06:17 GMT

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి బీజేపీ శ్రేణులు వస్తుండటంతో అసెంబ్లీ ప్రాంతంలో పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే దారిని పోలీసులు దిగ్బంధనం చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బయలుదేరారు. దీంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

Tags:    

Similar News