బీజేపీ ఫిగర్ పెరిగిందా?

Update: 2018-05-19 08:13 GMT

ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే బీజేపీకి దగ్గరయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ ఫిగర్ రెండు నుంచి పదిమందికి చేరినట్లు తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలయింది. కాంగ్రెస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలియడంతో కాంగ్రెస్ చర్యలకు దిగింది. దీంతో ప్రతి శాసనసభ్యుడిపై నిఘాను పెట్టింది. అయితే బలపరీక్ష సమయంలో వీరు ఎటు వైపు మొగ్గు చూపుతారోనన్న ఉత్కంఠ రెండు పార్టీల్లో ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ తో మాట్లాడిన ఆడియో టేపుల్లో కూడా యడ్యూరప్ప ఆఫర్ ఆ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేసింది. మంత్రిపదవితో పాటు ఐదుకోట్లు ఇస్తామని చెప్పడం, ఇందుకు బీసీ పాటిల్ తన వద్ద ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడం కలవరం రేపుతోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్పీకారం ముగిసింది. దీంతో సభ మధ్యాహ్న3.30 గంటలకు వాయిదా వేశారు. మొత్తం 195 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో ముగ్గురు హాజరు కాలేదు. ఇందులో బీజేపీకి చెందిన గాలి సోమరశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన ఆనంద్ సింగ్, మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. వీరు నేరుగా 3.30గంటలకు సభకు వచ్చి ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

Similar News