బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చాకే జగన్ డిశ్చార్జ్...!!

Update: 2018-10-26 03:41 GMT

విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడికి గురైన వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. జగన్ కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే జగన్ రక్త నమూనాలను ఇప్పటికే ఆసుపత్రి వైద్యులు ముంబయికి పంపారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి కత్తికి ఏదైనా రసాయానాలు పూశారా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ లు వచ్చిన తర్వాతనే ఆసుపత్రి నుంచి జగన్ ను డిశ్చార్చ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆసుపత్రికి చేరుకున్న ఏపీ పోలీసులు.......

ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్ ను విజయమ్మ పరామర్శించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్ స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి ఆసుపత్రికి చేరుకున్నారు. జగన్ కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈరోజు జగన్ సీబీఐ కేసులో కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే దాడి ఘటనతో జగన్ తరుపున న్యాయవాదులు కోర్టులో పిటీషన్ వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు కూడా బ్రేక్ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే జరిగిన దాడి ఘటనపై వైసీపీ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలవాలని కూడా నిర్ణయించారు.

Similar News