పీపీఏలపై రభస

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్తోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై లేవనెత్తిన ప్రశ్న కొంత [more]

Update: 2019-12-09 04:13 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్తోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై లేవనెత్తిన ప్రశ్న కొంత సభలో గందరగోళం సృష్టించింది. పీపీఏలపై కమిటీలు వేయడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. పీపీఏ సమీక్షలు వద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ పేర్కొంది. దీనికి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సమాధానం చెప్పారు. ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసిన వాటిపై సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనికి టీడీపీ రాద్ధాంతం చేస్తుందన్నారు. నాణ్యమైన విద్యుత్తును అతి తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. పీపీఏలలో అవినీతి జరిగితే సమీక్ష చేయమని నిబంధనల్లోనే ఉందన్నారు. ఇప్పటికే పీపీఏలపై ప్రభుత్వం కమిటీ వేసిందని, నివేదిక రాగానే ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. జరిగిన దోపిడీని అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తమకు మాట్లాడే అవకాశమివ్వాలని టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. తమకు ఈ అంశంపై ప్రొటెస్ట్ చేసే అవకాశం కల్పించాలని కోరారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రొటెస్ట్ చేసే సంప్రదాయం లేదని, కొత్త సంప్రదాయానికి తెరతీయవద్దని కోరారు.

Tags:    

Similar News