బ్రేకింగ్ : కొత్త రెవెన్యూ వ్యవస్థకు ఆమోదం.. వీఆర్వో వ్యవస్థ రద్దు

నూతన రెవెన్యూ వ్యవస్థకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దయింది. ఎమ్మార్వోలకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు అప్పగించనున్నారు. తప్పుచేసిన ఎమ్మార్వోలపై [more]

Update: 2020-09-11 12:40 GMT

నూతన రెవెన్యూ వ్యవస్థకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దయింది. ఎమ్మార్వోలకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు అప్పగించనున్నారు. తప్పుచేసిన ఎమ్మార్వోలపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారానే ఇక రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఉంటాయి. కొత్త రెవెన్యూ బిల్లు చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరినా ప్రభుత్వం దానిన తోసిపుచ్చింది. మూజువాాణి ఓటుతో బిల్లును శాసనసభ ఆమోదించింది.

Tags:    

Similar News