By elections : పోలింగ్ ప్రారంభం… అన్ని ఏర్పాట్లు పూర్తి

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలో బద్వేలులో ఉప ఎన్నిక ప్రారంభమయింది. హుజూరాబాద్ లో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను [more]

Update: 2021-10-30 01:40 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలో బద్వేలులో ఉప ఎన్నిక ప్రారంభమయింది. హుజూరాబాద్ లో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాు చేశారు. కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు చేపట్టారు. హుజూరాబాద్ ఉఫ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు.

బద్వేలులోనూ….

ఆంధ్రప్రదేశ్ లోని బద్వేలు ఉప ఎన్నికకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 221 కేంద్రాలు సమస్మాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ, బీజేపీ అభ్యర్థిగా పంతల సురేష్, కాంగ్రెస్ అభ్యర్థిగా కమలమ్మ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 15 మంది అభ్యరథులు బరిలో ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభమయింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.

Tags:    

Similar News