బ్రేకింగ్: ఏపీలో నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మొగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టింకోనందున ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు కార్మిక నేతలు ప్రకటించారు. [more]

Update: 2019-01-23 07:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మొగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టింకోనందున ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు కార్మిక నేతలు ప్రకటించారు. బుధవారం విజయవాడలో కార్మిక నేతలు మీడియాతో మాట్లాడుతూ… అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని వారు ఆరోపించారు. నాలుగేళ్లుగా ఆర్టీసీని ఆదుకుంనేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. 50 శాతం ఫిట్ మెంట్ తో కార్మికుతల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ట్యాక్స్ హాలీడే ప్రకటించాలన్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నామో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

Tags:    

Similar News