ఇచ్చిన మాటకే వచ్చా

కుల, మతాలు, ప్రాంతాలు, పార్టీల కతీతంగా పథకాలు అమలు పరుస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆ విధంగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు [more]

Update: 2019-10-04 07:13 GMT

కుల, మతాలు, ప్రాంతాలు, పార్టీల కతీతంగా పథకాలు అమలు పరుస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆ విధంగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు జగన్ చెప్పారు. ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి చలించిన వైఎస్‌ జగన్‌ ఏలూరులో జరిగిన బహిరంగ సభలో​ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్‌, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అయిదేళ్ల పాటు ప్రతి ఏడాది మీ ఖాతాలోకి డబ్బులు వేస్తామన్నారు జగన్. లంచాలకు, వివక్షతకు తావులేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను అమలు పరుస్తామన్నారు జగన్.

 

 

Tags:    

Similar News