ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ఏపీ కేబినెట్ బుధవారం భేటీ అయ్యింది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. మత్యస్యకారులు, ఆర్టీసీ, రైతు [more]

Update: 2019-10-16 11:01 GMT

ఏపీ కేబినెట్ బుధవారం భేటీ అయ్యింది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. మత్యస్యకారులు, ఆర్టీసీ, రైతు భరోసా, హోంగార్డుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు, ఆరోగ్య రంగ సంస్కరణలపై సుజాతారావు కమిటీ నివేదికకు ఆమోదం, కంటివెలుగు, రైతు భరోసా పథకాలపైనా చర్చించారు.

చేనేతకు చేయూత

చేనేత కార్మిక కుటుంబాలకు రూ.24వేల రూపాయల సాయం, మత్స్యకారులకు వేట నిషేద సమయంలో ఇచ్చే సాయం పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. చేనేత కార్మికుల కుటుంబాలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.24వేల ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించారు. ఏటా డిసెంబర్ 21న అందజేయాలని, దీనివల్ల 90వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. మెకనైజ్డ్ బోట్లు ఉన్న వారికే కాకుండా తెప్పలపై వేట సాగించే వారికి కాకుండా తొలిసారిగా ఈ పథకం వర్తిస్తుంది. అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న ఈ పథకం ప్రారంభించనున్నారు. అదే విధంగా డీజిల్ పై లీటర్ కు రూ.9 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

3500 కొత్త బస్సులు..

హోంగార్డుల జీతాల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోజుకు ఇచ్చే రూ.600 అలవెన్స్ ను రూ.710కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మధ్నాహ్న భోజన పథకం కార్మికుల వేతనాన్ని మూడు వేలకు పెంచేందుకు ఆమోదం తెలిపారు. అందరికీ సురక్షితమైన మంచినీళ్లు అందించేందుకు వాటర్ గ్రిడ్ కార్పోరేషన్ ఏర్పాటు, శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ లో 5 రెగ్యులర్, 100 కాంట్రాక్టు, 60 ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకానికి ఆమోదం తెలిపింది. ఏపీఎస్ ఆర్టీసీలో కాలం చెల్లిన సుమారు 3500 బస్సులను తొలగించి కొత్త బస్సుల కొనుగోలుకు కేబినెట్ఆమోదం తెలిపింది.

 

Tags:    

Similar News