రమణ దీక్షితులుకి మరో షాక్

Update: 2018-06-26 14:21 GMT

తిరుమల ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులుకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరో షాక్ ఇచ్చింది. వయోపరిమితి పేరుతో ఇటీవల ఆయనను ప్రధానార్చకులు పదవి నుంచి తొలగించిన టీటీడీ, ఇప్పుడు ఆగమ సలహా మండలి సభ్యులుగా కూడా ఆయనను తొలగించింది. రమణ దీక్షితులు స్థానంలో ప్రస్థుత ప్రధానార్చకులు వేణుగోపాల్ దీక్షితులును నియమించారు. దీంతో రమణ దీక్షితులుకి శ్రీవారి ఆలయంతో పూర్తిగా సంబంధం తెగిపోయినట్లు అయ్యింది. ఆయన 24 ఏళ్లుగా శ్రీవారికి కైంకర్యాలు చేస్తున్నారు. ఈ పరిణామంపై రమణ దీక్షితులు స్పందించాల్సి ఉంది.

Similar News