పోలీస్ శాఖలో ప్రక్షాళనా..? రాజకీయ ఎత్తుగడ ..?

Update: 2018-07-18 10:39 GMT

ఎపి సర్కార్ 9 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఇది రొటీన్ గా జరిగే వ్యవహారమే అయినా రాబోయే ఎన్నికల దృష్ట్యానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలియవస్తుంది. గత నెలలో భారీ సంఖ్యలో ఐఏఎస్ లను బదిలీ చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేయడం ఎపి లో చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ లు ఐపీఎస్ ల పనితీరు ఆధారంగా ఎవర్ని ఎక్కడ నియమించాలి అనే అంశంపై సర్కార్ కసరత్తు చేసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఎపి పోలీస్ బాస్ కూడా మారడంతో ప్రక్షాళన అనివార్యం అయ్యింది అని కూడా అంటున్నారు.

ఎవరెక్కడ ...?

ద్వారకా తిరుమల రావు ........ విజయవాడ సిపి

మహేష్ చంద్ర లడ్డా ................ విశాఖ సిపి

టి యోగానంద్ ..................... విజయవాడ అడిషనల్ కమిషనర్

టి రవికుమార్ మూర్తి ............. ఏలూరు రేంజ్ డిఐజి

డా. షేముషి......................... రాజమండ్రి అర్బన్ ఎస్పీ

బి. రాజకుమారి ................... విజయవాడ క్రైమ్ డిసిపి

బి కృష్ణా రావు ...................... తుళ్ళూరు ఎఎస్పీ

రాహుల్ దేవ్ సింగ్ ................. రంపచోడవరం ఎఎస్పీ

అజితా వేజెండ్ల ...................... రాజమండ్రి దక్షిణ మండలం ఎఎస్పి

Similar News