ఏపీపై ఆజాద్ ఏమన్నారంటే....?

Update: 2018-07-24 09:33 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కేవలం పార్లమెంట్ కు, పార్టీలకే కాదు మొత్తం దేశానికి సానుభూతి ఉందని రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంట్ వేదికగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ నేతగా ఆంధ్రప్రదేశ్ తో తనకు అనుబంధంగా ఉందని, ఏపీ ప్రజల మనోభావాలు తనకు తెలుసన్నారు. విభజన చరిత్ర తెలిస్తేనే ఏపీ సమస్యలు తెలుస్తాయన్నారు. తెలంగాణ కి ఉన్న అవకాశాలు ఏపీకి లేవని, ప్రత్యేక తెలంగాణ కొరడం ఎంత సమంజసమో ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడం కూడా అంతే సమంజసమన్నారు.

కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని బీజేపీ నేతలే కోరారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వమని, ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.16 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి 10 వేల కోట్లు అవసరమైతే కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. పైగా సుప్రీం కోర్టులో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేశామని కేంద్ర అఫిడవిట్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వం దేశాన్ని, సుప్రీం కోర్టును, ఏపీని మోసం చేస్తుందన్నారు.

Similar News