అమరావతి రైతులు @ 100 డేస్

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన వందో రోజుకు చేరుకుంది. గత మూడు నెలలకు పైగానే వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను [more]

Update: 2020-03-26 02:51 GMT

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన వందో రోజుకు చేరుకుంది. గత మూడు నెలలకు పైగానే వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో తెచ్చిన వెంటనే రైతులు ఆందోళనకు దిగారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. బంద్ కు అనేకసార్లు పిలుపునిచ్చారు. తాము భూములిచ్చినా ప్రభుత్వం ఇక్కడి నుంచి రాజధానిని తరలించడాన్ని వారు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం తమతో కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో మూడు అడుగుల దూరంలో కూర్చుని మాస్కులు వేసుకుని రైతులు ఆందోళన చేస్తున్నారు.

Tags:    

Similar News