జగన్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ప్రధానంగా ఇసుక కొరతతో మాఫియా చెలరేగిపోతున్న నేపథ్యంలో అక్రమ [more]

Update: 2019-11-13 03:45 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ప్రధానంగా ఇసుక కొరతతో మాఫియా చెలరేగిపోతున్న నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చట్టాన్ని తేవాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించనుంది. ఈ మేరకు అక్రమంగా ఇసుకను తరలించే వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవవరణలను తెచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఇంగ్లీష్ మీడియంపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సింగపూర్ స్టార్టప్ ఏరియా ఒప్పందం రద్దుపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Tags:    

Similar News