ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమయింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నవయుగ కంపెనీ టెండరును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది. పనుల [more]

Update: 2019-09-04 06:26 GMT

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమయింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నవయుగ కంపెనీ టెండరును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది. పనుల కోసం ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని రివకరీ చేయడానికి కూడామంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు 3,216 కోట్ల పనుల రద్దుకు ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్ కు ఆమోదం తెలిపింది. ఆశావర్కర్ల వేతనాన్ని మూడు వేల నుంచి పదివేల రూాపాయలకు పెంచుతూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించంది. మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆమోదించింది. పనులు ప్రారంభం కాని మచిలీపట్నం పోర్టుకు సంబంధించి 425 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

Tags:    

Similar News