వారికేస్తే ఒవైసీకి వేసినట్లే....!!

Update: 2018-11-25 07:24 GMT

కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ఓట్లేస్తే మజ్లిస్, ఓవైసీ పార్టీలకు ఓట్లు వేసినట్లేనని, ప్రజాస్వామ్య బద్ధమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సర్కార్ ఉండాలంటే బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అమిత్ షా కొద్దిసేపటి క్రితం పరకాలలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించేముందు రాణి రుద్రమ దేవిని స్మరించుకున్నారు. పార్లమెంటు ఎన్నికలతో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే తీసుకురావడానికి అనేక కారణాలున్నాయన్నారు. దీనివల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే మోదీ ప్రభావం ఉంటుందని భావించి కేసీఆర్ ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్నారు.

ఆ... రిజర్వేషన్లు చెల్లవు....

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన కులాలకు సంబంధించిన కమిషన్ ను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేదు. మోదీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే కమిషన్ వేసిందన్నారు. కేసీఆర్ మత ఆధారంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది విరుద్ధమన్నారు. యాభై శాతానికి రిజర్వేషన్లు మించకూడదని తెలిసినా కేసీఆర్ ఓట్ల కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. తాము చట్ట వ్యతిరేకమైన మతాధారిత రిజర్వేషన్లకు విరుద్ధమన్నారు. మజ్లిస్ ప్రభావం లేని ప్రభుత్వం ఏర్పాటు ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని అమిత్ షా చెప్పారు.

Similar News