ఇప్పటికైనా మించిపోయింది లేదు

శివసేన కొత్త షరతులు పెట్టడం వల్లనే తాము వెనక్కు తగ్గామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై అమిత్ షా స్పందించారు. ఎన్నికల [more]

Update: 2019-11-13 14:26 GMT

శివసేన కొత్త షరతులు పెట్టడం వల్లనే తాము వెనక్కు తగ్గామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై అమిత్ షా స్పందించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 18 రోజులు గడిచినా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడం వల్లనే రాష్ట్రపతి పాలనను విధించామన్నారు. అన్ని పార్టీలకూ తగిన సమయమే ఇచ్చామన్నారు అమిత్ షా. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఎవరైనా తగిన బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలనుకుంటే ఆరు నెలల సమయం ఉందని చెప్పారు. తాము ఎన్నికల ప్రచారంలోనే దేవేంద్ర ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించామని అమిత్ షా గుర్తు చేశారు. అప్పుడు శివసేన అభ్యంతరం వ్యక్తం చేయకుండా, ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త డిమాండ్లు పెట్టిందని, అందుకే శివసేన షరతులకు తాము అంగీకరించలేదని అమిత్ షా స్పష్టం చేశారు.

Tags:    

Similar News