శరత్ హత్య కేసులో నిందితుడు మృతి

Update: 2018-07-16 05:51 GMT

ఈ నెల నాలుగో తేదీన వరంగల్ కు చెందిన శరత్ ను కాల్చిచంపిన దుండగుడు ని పోలీసులు కాల్చి చంపారు. శరత్ హత్యలో నిందితుడైన నల్లజాతి యువకుడికోసం పోలీసులు గత కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. అయితే పక్కా సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులపై ఆ యువకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురి పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో ఎదురుకాల్పులు పోలీసులు జరపడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నల్లజాతీయులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News