అమరావతిపై మా ప్లాన్ మాకుంది

జీఎన్ రావు కమిటీ నివేదిక తదనంతర పరిణామాలపై చర్చించామని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో రాజధాని అమరావతి విషయంపై చర్చించారు. రైతుల ఆందోళనపై కూడా [more]

Update: 2019-12-26 12:44 GMT

జీఎన్ రావు కమిటీ నివేదిక తదనంతర పరిణామాలపై చర్చించామని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో రాజధాని అమరావతి విషయంపై చర్చించారు. రైతుల ఆందోళనపై కూడా చర్చించామన్నారు. 5,800 కోట్లతో అమరావతి రాజధాని కోసం చంద్రబాబు ఖర్చు చేశారని, మొత్తం పనులు పూర్తి చేయాలంటే లక్షా తొమ్మిది వేల కోట్లు అవసరమవుతుందని వారు చెప్పారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమరావతిలో అంత సొమ్ము వెచ్చించడం సాధ్యం కాదని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందాలన్నది ప్రభుత్వ నిర్ణయమన్నారు. పెట్టుబడి లేకుండా అమరావతిని అభివృద్ధి చేయడం ఎలాగా? అన్న దానిపై చర్చించామని తెలిపారు. అమరావతి ప్రాంతంపై రేపు కేబినెట్ లో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. తాత్కాలిక రాజధానిపై ఆశలు పెట్టుకుంటే తాము చేయగలిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వంపై ఎవరూ కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని వారు తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News