ఏటీఎం సెంటర్ల కు వెళ్తున్నారా..? ఈ వార్త చదవండి..!

Update: 2018-10-29 11:01 GMT

ఏటీఎస్ సెంటర్లను టార్గెట్ చేసి డబ్బులు కొట్టేస్తున్న ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. ఏటీఎం లలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన కస్టమర్ల వెనకాలే నిలబడి ఎటిఎం కార్డు నెంబర్, పిన్ నంబర్లను నోట్ చూసుకొని డబ్బులు మాయం చేస్తున్నారు నిందితులు. ఇలా నోట్ చేసుకున్న ఏటీఎం నెంబర్, పిన్ నెంబర్ల ద్వారా ఫ్లిప్ కార్ట్ లో విలువైన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు ముఠా సభ్యులు. ముఖ్యంగా ఓటీపీ ఆప్షన్ లేని యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లను ఈ ముఠా ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. బిహార్ కు చెందిన ఈ ముఠాలోని మనీష్ కుమార్, వినోద్ కుమార్, మంజేశ్ కుమార్ లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరు ఇప్పటివరకు 200 మందిని మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు రూ.1 లక్ష నగదు, 18 మొబైల్ ఫోన్లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.

Similar News