అఖిల ఇంటికి పోలీసులు

మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసేందుకు కర్నూలు జిల్లా నుంచి పోలీసులు హైదరాబాద్ లోని [more]

Update: 2019-10-22 06:51 GMT

మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసేందుకు కర్నూలు జిల్లా నుంచి పోలీసులు హైదరాబాద్ లోని అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. అయితే ఏపీ పోలీసులను అఖిలప్రియ ఇంట్లోకి అనుమతించలేదు. ఎలాంటి వారెంట్లు లేకుండా ఎలా సోదాలకు వస్తారని అఖిలప్రియ ప్రశ్నించారు. కాగా అఖిలప్రియ భార్గవ్ రామ్ పై అనేక కేసులు నమోదయి ఉన్నాయి. మైనింగ్ కేసు మాత్రమే కాకుండా ఏపీ పోలీసుల విధులకు ఆటంకం కల్గించారన్న కేసులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా అఖిలప్రియ పోలీసులతో వాదులాటకు దిగారు. కర్నూలు ఎస్పీ కావాలనే తమ కుటుంబంపై కక్ష కట్టారని ఆరోపించారు.

Tags:    

Similar News