నేడు సిట్ విచారణకు ఆది

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని స్సెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు [more]

Update: 2019-12-12 03:00 GMT

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని స్సెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఆదినారాయణరెడ్డికి నోటీసు ఇచ్చారు. తాను కూడా విచారణకు హాజరవుతానని ఆదినారాయణరెడ్డి చెప్పారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన ఆదినారాయణరెడ్డి ఈరోజు సిట్ ఎదుటకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డితో పాటు ఆయన డ్రైవర్ ను ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News