బాలికపై నటి భానుప్రియ కర్కశత్వం

తన 14 ఏళ్ల కూతురిని పనిలో పెట్టుకున్న నటి భానుప్రియ వేదిస్తున్నారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పీఎస్ లో ఓ తల్లి ఫిర్యాదు చేశారు. సామర్లకోటకు [more]

Update: 2019-01-24 10:03 GMT

తన 14 ఏళ్ల కూతురిని పనిలో పెట్టుకున్న నటి భానుప్రియ వేదిస్తున్నారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పీఎస్ లో ఓ తల్లి ఫిర్యాదు చేశారు. సామర్లకోటకు చెందిన ఓ మహిళ ఆర్థిక ఇబ్బందులతో తన కుమార్తె(14)ను ఏడాది క్రితం చెన్నైలో భానుప్రియ వద్ద పనికి కుదిర్చారు. అయితే, అప్పటి నుంచి తన కూతురిని చూడనివ్వడం లేదని, బాలికను నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇటీవల బాలిక తన తల్లికి ఫోన్ చేసిన ఈ విషయాలన్నీ చెప్పింది. భానుప్రియ సోదరుడు బాలికను లైంగికంగా వేదిస్తున్నారని కూడా ఆమె ఫిర్యాదు చేశారు. తన కూతురిని ఇంటికి పంపించడం లేదని, అడిగితే దొంగతనం కేసు పెడతానని అంటున్నారని వాపోయారు. దీంతో సామర్లకొట పోలీసులు చెన్నైలోని చైల్డ్ లైఫ్ సంస్థకు సమాచారం అందించారు.

Tags:    

Similar News