ఇక విలన్ గా చూడలేం.. హీరోగానే చూస్తాం

చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు ట్రాక్టర్ బహుకరించిన సినీనటుడు సోనూ సూద్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి సోనూ సూద్ సేవలను [more]

Update: 2020-07-27 04:55 GMT

చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు ట్రాక్టర్ బహుకరించిన సినీనటుడు సోనూ సూద్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి సోనూ సూద్ సేవలను ప్రశంసించారు. తాను ఇక ఆయనను విలన్ గా చూడలేనని, సినిమాలో హీరోగానే చూడాలని ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ లాంటి సంస్థల సేవా కార్యక్రమాలను చూశామని, కానీ ఒక వ్యక్తికి ఇంత మంచి హృదయం ఉంటుందా? అన్నది సోనూ సూద్ ను చూసిన తర్వాతనే తెలిసిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. వేలాది మంది వలస కార్మికులను, ఇతర దేశాల నుంచి విద్యార్థులను స్వస్థలాలకు తరలించడమే కాకుడా, ఒక పేద రైతుకు ట్రాక్టర్ ను ఇవ్వడం ఆయన సేవా భావానికి నిదర్శనమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News