జయరాం కేసు: తెలంగాణ పోలీస్ అధికారులపై వేటు

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఇద్దరు తెలంగాణ పోలీసులపై వేటు పడింది. హత్యకేసులో నిందితుడు రాకేష్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై హైదరాబాద్ లోని నల్లకుంట [more]

Update: 2019-02-05 10:55 GMT

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఇద్దరు తెలంగాణ పోలీసులపై వేటు పడింది. హత్యకేసులో నిందితుడు రాకేష్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై హైదరాబాద్ లోని నల్లకుంట సీఐ శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. ఇక, ఘటన జరిగిన తర్వాత నిందితుడు రాకేష్ రెడ్డి… ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లుగా కాల్ లిస్ట్ లో భయటపడింది. దీంతో ఏసీపీ మల్లారెడ్డిపైన కూడా పోలీసు శాఖ బదిలీ వేటు వేసింది. ఆయనను అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. కాగా, జయరాం మర్డర్ మిస్టరీ వీడుతోంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Tags:    

Similar News