బ్రేకింగ్ : బిగ్ బాస్ విన్నర్ అభిజిత్

బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్ గా అభిజిత్ ఎంపికయ్యారు. గ్రాండ్ ఫినాలేలో ముఖ్య అతిధులుగా అనేకమంది సినిమా ప్రముఖులు వచ్చారు. విన్నర్ ను ప్రకటించేందుకు మెగాస్టార్ [more]

Update: 2020-12-20 17:11 GMT

బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్ గా అభిజిత్ ఎంపికయ్యారు. గ్రాండ్ ఫినాలేలో ముఖ్య అతిధులుగా అనేకమంది సినిమా ప్రముఖులు వచ్చారు. విన్నర్ ను ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. టాప్ 5లో ఉన్న అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఉన్నారు. వీరిలో తొలుత టాప్ 5 నుంచి హారిక ఎలిమినేట్ అయింది. తర్వాత అరియానా ఎలిమినేట్ అయింది. పది లక్షల సూట్ కేసు తీసుకెళ్లమని చెప్పినా ఎవరూ అందుకు సుముఖత చూపకపోవడంతో అరియానా ను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. టాప్ 3లో అఖిల్, అభిజిత్, సోహైల్ ఉన్నారు. దీంతో బిగ్ బాస్ 25 లక్షల సూట్ కేసును పంపారు. ఈ సూట్ కేసు తీసుకెళ్లడానికి ముగ్గురూ ముందు ఇష్టపడలేదు. తర్వాత సొహైల్ 25లక్షల సూట్ కేసును తీసుకున్నారు. ఇందులో పది లక్షలు అనాధాశ్రమానికి ఇస్తామని సోహైల్ ప్రకటించారు. కానీ నాగార్జున మాత్రం ఆ పదిలక్షలు తాను ఇస్తానని చెప్పడంతో సోహైల్ ప్రైజ్ మనీ 25 లక్షలు గెలుచుకున్నట్లయింది. చిరంజీవి మెహబూబ్ కు పది లక్షల చెక్కును ఇచ్చారు. టాప్ 2లో అభిజిత్, అఖిల్ మిగిలారు. చివరకు అభిజిత్ విన్నర్ గా ఎంపికయ్యారు.

Tags:    

Similar News