హైదరాబాద్ లో నయా గ్యాంగ్… పారాహుషార్

హైదరాబాద్ నగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మోసాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఎందుకంటే ఈ తరహా లో కూడా మోసం చేయవచ్చునని [more]

Update: 2021-04-25 01:25 GMT

హైదరాబాద్ నగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మోసాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఎందుకంటే ఈ తరహా లో కూడా మోసం చేయవచ్చునని తెలుసుకున్నారు. కర్ణాటక చెందిన శివయ్య తో పాటు మరో ముగ్గురు కలిసి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట లో ఉంటున్న ఒక వ్యక్తిని కలిశారు. కర్ణాటకలో బంగారం నిధి దొరికిందని, దానిని తవ్వకాలు చేస్తున్నామని, మీకు సంబంధించిన విజిటింగ్ కార్డు ఒక ప్రముఖుడు మాకు ఇచ్చారని, బంగారం మీరు కొనుగోలు చేస్తారని చెప్పారని శివయ్య అండ్ గ్యాంగ్ నమ్మబలికారు. ముందుగా సదరు వ్యాపారవేత్త నమ్మలేదు. వారం రోజుల తర్వాత బంగారు ఆభరణాలు తీసుకొని శివయ్య అండ్ గ్యాంగ్ హైదరాబాద్ వచ్చింది. వ్యాపారవేత్తలు కలిసింది. బంగారం నిధి తీస్తున్న సమయంలో తమకు ఆభరణాలు లభ్యమయ్యాయని, వీటిని కూడా అమ్మాలని అనుకుంటు న్నామని చెప్పారు. అయితే ఈ ముందుగా బంగారం షాప్ వద్దకు తీసుకు వెళ్లి అసలు బంగారం చెక్ చేసుకోమని చెబుతారు. దీంతో సదరు వ్యాపారవేత్త బంగారం షాప్ కి వెళ్లి బంగారం నాణ్యతను చెక్ చేసుకుంటాడు. అది ఒరిజినల్ అని తేలుతుంది. దీంతో వ్యాపారవేత్త ఆశ పడి శివయ్య వద్ద ఉన్న బంగారు ఆభరణాలను 17 లక్షలకు కొనుగోలు చేశాడు. శివయ్య గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వారం రోజుల తర్వాత వ్యాపారవేత్త బంగారం షాప్ వాటిని విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే అవి గిల్టు నగలను తేలిపోతుంది. దీంతో తాను మోసపోయానని చెప్పి పోలీసులను ఆశ్రయించారు. చివరకు కర్ణాటక కేంద్రంగా పని చేస్తున్న శివయ్య అండ్ గ్యాంగ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ ప్రముఖ హోటల్ టూరిస్ట్ స్పాట్ లకు వెళ్లి అక్కడ విజిటింగ్ కార్డ్స్ ను కలెక్ట్ చేస్తుంది. ఈ కార్డుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వ్యాపారవేత్తలు కలిసి బంగారం ఆభరణాలు పేరు చెప్పి మోసాలకు పాల్పడుతుంటారు. ఇప్పటివరకు ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక, తమిళ లో చాలా మంది వ్యాపారవేత్తలను ఈ గాంగ్ మోసం చేసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

Tags:    

Similar News