దిశ ఎన్‌కౌంటర్ బూటకం

Update: 2022-05-20 09:30 GMT

హైదరాబాద్‌లో 2019 దిశ ఎన్‌కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ తాజాగా పేర్కొంది. చట్టపరమైన పలు నిబంధనలను, పోలీసు మాన్యువల్ రూల్స్‌ని అతిక్రమించి ఎన్‌కౌంటర్ కు పాల్పడినట్లు తేల్చింది ప్యానెల్. దిశ ఎన్‌కౌంటర్ బూటకమని, పోలీసులు కావాలనే వారిని కాల్చి చంపారని సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ పేర్కొంది. పోలీసులు హత్యకు పాల్పడ్డారని ప్యానెల్ తేల్చింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన బూటకమని.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో సుప్రీంకోర్టుకు కమిషన్ రిపోర్ట్ సమర్పించింది. పోలీసులు కావాలనే నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో పేర్కొంది. పోలీస్ మ్యానువల్‌కు భిన్నంగా విచారణ చేపట్టినట్టు తెలిపిన కమిషన్.. నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయం పోలీసులు దాచారని నివేదికలో వెల్లడించింది. పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చేరడం కట్టుకథ అని ఆరోపించింది.

ఈ ఫేక్ ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన 10 మంది పోలీసులు సురేందర్, నర్సింహారెడ్డి షేక్ లాల్ మదర్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, వెంకటేశ్వర్లు అరవింద్ గౌడ్, జానకిరామ్, బాలు రాథోడ్, డి. శ్రీకాంత్‌పై 302 సెక్షన్ కింద హత్య కేసు పెట్టాలని కమిషన్ సిఫార్సు చేసింది. మీడియాకు, విచారణ కమిషన్‌కు పోలీసులు కట్టుకథలు చెప్పారని ఆరోపించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసును హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. అభ్యంతరాలను హైకోర్టుకు చెప్పాలని సూచించింది.


Tags:    

Similar News