ఇంకా పుట్టిలోనే ప్రయాణం

పాత జంగమయ్య పల్లి గ్రామాల ప్రజలు వాగులో పుట్టి మీదనే ప్రయాణం చేస్తున్నారు

Update: 2022-01-29 07:57 GMT

ఎంత అభివృద్ధి చెందుతున్నా ప్రమాదరకమైన ప్రయాణాలు మాత్రం తప్పడం లేదు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ పంచాయతీలోని పాత జంగమయ్య పల్లి గ్రామాల ప్రజలు వాగులో పుట్టి మీదనే ప్రయాణం చేస్తున్నారు. ఊకచెట్టు వాగు నుంచి రెండు గ్రామాల ప్రజలు పుట్టినే ఆశ్రయిస్తున్నారు. వాగు లేనప్పుడు వేసిన మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ప్రమాదకరమైన ప్రయాణాలు తప్పడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

వంతెనను నిర్మించాలన్నా....
నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా, వైద్యానికి వెళ్లాలన్నా ఈ పుట్టి నుంచే ప్రయాణిస్తున్నారు. రెండు గ్రామాల మధ్య రోజూ వ్యవసాయ పనులకు వెళ్లాల్సి వస్తుంది. అయితే వాగులో గుంతలు తవ్వినందున ఇరవై అడుగుల లోతు ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. వాగు దాటాలంటే ప్లాస్టిక్ పుట్టిలో ఎక్కి తాడు సాయంతో లాగుతూ వెళతామని చెబుతన్నారు. ఇక్కడ వంతెన నిర్మిస్తామని అనేక ఏళ్లుగా ప్రజాప్రతినిధులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఏమాత్రం తాడు తెగినా పుట్టి సరళసాగర్ ప్రాజెక్టులో పడే అవకాశమందని వారు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News