గుడ్ టైమ్... బంగారం కొనుగోలుకు?

బంగారం ధరలు పెరిగే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో బంగారం మరింత ప్రియం అవుతుంది.

Update: 2021-12-07 01:19 GMT

బంగారం ధరలు పెరిగే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో బంగారం మరింత ప్రియం అవుతుంది. దీంతో ఇప్పడే బంగారాన్ని కొనుగోలు చేయడానికి మంచి సమయమని చెబుతున్నారు. పెట్టుబడిగానూ, పొదుపుగానూ చూసే వాళ్లంతా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇది సరైన టైమ్ అని నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధరలు ఇలా..
ఈరోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,760 రూపాయలుగా ఉంది. అలాగే పదిగ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 48,830 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.


Tags:    

Similar News