లైఫ్ స్టైల్ : పెసర్లు తినండి,ఆరోగ్యంగా జీవించండి

Update: 2018-02-14 04:08 GMT

ప్రస్తుతం హైబ్రిడ్ పదార్దాల కాలంలో ఎం తినలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.ఏది తింటే శరారీనికి ,ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో ,ఏది తింటే ఎలాంటి విపత్కర పరిస్దితులు దాపురిస్తాయోననే భయాందోళన చెందాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మనకు నిత్యం అందుబాటులో లభించే విత్తనాలు,తృణధాన్యాలను నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత తినడం ఆరోగ్యానికి ఎంతో లాభదయకం అని వైద్యులు చెప్పుతున్నారు.మన శరారీనికి పోషకాలను అందించే ముఖ్య ఆహార పదార్దాలలో పెసర్లు చాలా ముఖ్యమైనవి.పోట్టు తీయాన్ని పెసర్లు మన ఆరోగ్యానికి ఎంతొ మంచివి.పెసర్లుతో దోసెలు, గారెలు మరియు పప్పు చెసుకోవచ్చును.ముఖ్యంగా పెసర్లును నానబెట్టి మొలకలు ఎత్తిన తరువాత అల్పహారంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి అవి ఎంతొ మంచివి.పెసర్లులలో విటమిన్ బి,విటమిన్ సి,మాంగనీస్,కాల్షియం,ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి గ్రీన్ కలర్ లో ఉండడం వలన వీటిని గ్రీన్ మూగ్ దాల్ అని అంటారు. పెసర్లు లలో పుష్కలమైన కాల్షియం మరియు తక్కువ కాలరీలు ఉంటాయి. ఈ పెసర్లు పప్పు ఎముకలకు చాల ఆరోగ్యకరం.పెసర్లు క్యాన్సర్ బారినపడకుండా కాపాడుతాయి.

పెసర్లులలో విటమిన్స్,మినరల్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు ,పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కాపాడుతాయి.మార్కెట్ లో ప్రతీ పదార్దం కల్తీమయం అవుతుండడంతో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో సందిగ్దత నెలకోంటోంది.అందువల్ల ఆరోగ్యసమస్యలు తలేత్తు తున్నాయి.దీంతో శరీర బరువు ,ఆరొగ్య విషయంలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి.అందువల్ల పెసర్లును నానబెట్టి,మొలకలు ఎత్తిన తరువాత తీసుకుంటే జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ లు అధికంగా ఉంటాయి.ఈ ఎంజైమ్ లు,ప్రోటిన్లు శరీరానికి ఉపయోగపడే అమైనో ఆమ్లాలు,పిండి పదార్దాన్ని,గ్లూకోజ్ గా తయారు చేస్తాయి.మొలకధాన్యాల్లో కాంప్లెక్స్,విటమిన్లు సి,ఏ,బీ అత్యధికంగా లభిస్తాయి.ఇందులో ఉండే విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది.కాలేయం పనితీరు సక్రమంగా పనిచేయడానికి మొలకలు తోడ్పడుతుంది.మొలకలు త్వరగా జీర్ణం అవుతాయి.అంతేకాక మొలకలలో ఆరోగ్యానికి హానికరమైన కొవ్వులు,కోలెస్ర్టాల్ తగ్గిస్తాయి.మొలకలకు క్షారగుణం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.మొలకలు గర్భిణులు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు.మొలకలలో పీచుపదార్దాలు,కాల్షియం,పాస్పరస్,ఇనుము,నియాసిస్,విటమిన్లు,ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.ఆరోగ్యానికి మంచివి అయిన పెసర్లును మొలకలుగా చేసుకోని తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.మొలకలు తినండి,ఆరోగ్యంగా జీవించండి....

Similar News