గళమెత్తక ముందునుంచే జగన్ మీద కౌంటర్ లు

Update: 2016-11-06 03:06 GMT

చంద్రబాబు నాయుడు శ్రేణులు చాల ఆక్టివ్ గా కనిపిస్తున్నాయి. ప్రత్యర్ధి నోరు తెరవక ముందే.. ప్రతిదాడులకు పూనుకోవడం ద్వారా... పైచేయి సాధించాలనే వ్యూహంతో తెలుగుదేశం మరియు శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం విశాఖ లో "జై ఆంధ్ర ప్రదేశ్" పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 బహిరంగ సభలు పెట్టి ప్రత్యేక హోదా గురించి అవగాహన కల్పించడానికి, పోరాట స్ఫూర్తి ని రగిలించడానికి ప్రయత్నం చేయబోతున్నారు.

అయితే జగన్ సభ లో గళమెత్తి హోదా కోసం తన పోరాటం ప్రకటించడానికంటే ముందే.. అటు టీడీపీ, ఇటు బీజేపీ శ్రేణులు అయన మీద ఎదురు దాడులకు దిగుతున్నాయి. సాంకేతికంగా ఎలాంటి అవకాశం లేని హోదా కోసం జగన్ అనవసరమైన పోరాటం చేస్తున్నారంటూ దెప్పి పొడుస్తున్నాయి. జగన్ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఈ పార్టీ లు ఆరోపిస్తున్నాయి. జగన్ వంటి ఉన్మాది సభలకు పిల్లలు వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. ఇదంతా జగన్ మీద విమర్శలే అనడంలో సందేహం లేదు.

పాలక పక్షాలు ఇంతగా ఆరాట పడుతున్నప్పటికీ జగన్ సభలకు జనం మాత్రం పెద్ద సంఖ్యలోనే వస్తుండడాన్ని విశేషంగా పరిగణించాలి. హోదా విషయంలో పాలకులు చెబుతున్న బుకాయింపులని జనం నమ్ముతున్నారో జగన్ మాటలకు విలువ ఇస్తున్నారో కొంతకాలానికి గాని తేలదు,

Similar News