Congress : ఏజెంట్లు కోసమేనా? కౌంటింగ్ కు కూడా ఉపయోగపడుతుందిగా బాసూ?

కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఏజెంట్లు దొరకకపోవడంతో మిగిలిన పార్టీలకు చెందిన వారే ఏజెంట్లుగా ఉండే అవకాశాలున్నాయి.

Update: 2024-04-25 06:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. రెండు ఏనుగులు పోటీపడుతుంటే కాంగ్రెస్ చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అభ్యర్థులయితే నియోజకవర్గాల్లో దొరికారు. అందుకు అనేక కారణాలున్నాయి. కొందరు వైసీపీలో టిక్కెట్ దొరకక కాంగ్రెస్ కండువా కప్పుకోగా, మరికొందరు పోలింగ్ రోజు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లవచ్చు. పాస్ లు అభ్యర్థులకు ఇస్తారు. అలాగే ఒక్కొక్క అభ్యర్థికి ఏజెంట్లను కూడా కేటాయిస్తారు. పోలింగ్, కౌంటింగ్ రోజు కూడా ఏజెంట్లను నియమించుకునే వీలుంది. ఏజెంట్ పాస్ ల కోసం కూడా పెద్దయెత్తున డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఏజెంట్లు దొరకకపోవడంతో మిగిలిన పార్టీలకు చెందిన వారే కాంగ్రెస్ ఏజెంట్లుగా ఉండే అవకాశాలున్నాయి.

వైసీపీని ఎదుర్కొనాలంటే....?
అందుకే ఏజెంటు పాస్ లకు మంచి గిరాకీ ఏర్పడింది. ఏపీలో ఎన్నికలు ఈసారి మామూలుగా జరగడం లేదు. పోలింగ్ కేంద్రంలో తమ వారు అత్యధిక సంఖ్యలో ఉండేలా చూసుకుంటున్నారు. అధికార వైసీపీ వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకునే అవకాశముందని తెలియడంతో కాంగ్రెస్ ఏజెంట్ల ఫారాలకు గిరాకీ పెరిగిందంటున్నారు. వాలంటీర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనాలంటే లోకల్ గా ఉన్న వారు నలుగురైదుగురు మనోళ్లు ఉంటే బెటర్ అని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా ఏజెంట్ పాస్‌లు వస్తాయి కానీ అది మరింత ఖర్చుతో కూడుకున్న పని అని విపక్షాలు భావిస్తున్నాయి.
ఏజెంట్ల కొరత...
కాంగ్రెస్ కు నిజానికి అనేక నియోజకవర్గాల్లో ఏజెంట్ల కొరత ఉంది. కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధి తీసుకుంటే ఆ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనంగానే ఉంది. దీని పరిధిలో ఉన్న బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఏజెంట్లు కూడా కరువయ్యారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అక్కడ వ్యక్తుల మధ్యనే కాకుండా వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో తమకు మరింత బలం కావాలంటే కాంగ్రెస్ ఏజెంట్లుగా తమ వారిని దించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తుంది.
ఏజెంట్ పాస్ లకు...
అధికార వైసీపీని ధీటుగా పోలింగ్ కేంద్రంలో ఎదుర్కొనాలంటే తమ బలం మరింతగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే ఒకరికి ఇద్దరు మనోళ్లుంటే పోలింగ్ కేంద్రంలో వాదనకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఏజెంట్ ఫారాలకు భారీ గిరాకీ ఏర్పడిందంటున్నారు. కాంగ్రెస్ తరుపున బరిలో ఉన్న అభ్యర్థులు కూడా పెద్దగా ఇందుకు అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. కొందరయితే ఏజెంట్ ఫారాలు అమ్మేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ చీఫ్ గా వైఎస్ షర్మిల రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమ ఏజెంట్లు ఫారాలను అమ్ముకునేందుకు రెడీ అయిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ కు ఆ మాత్రమైనా అభ్యర్థులు దొరికారంటే అదీ కారణమన్న కామెంట్స్ వినపడుతున్నాయి.




Tags:    

Similar News