హీరోయిన్ ప్రవర్తనతో అవాక్కయిన అభిమానులు

Update: 2018-01-21 16:23 GMT

వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వాటి పై పడే పన్ను తగ్గించుకోవటం కోసం ఒకరి సొమ్ముతో కొనుగోలు చేసే వాహనానికి ఇంకెవరి పేరునో రిజిస్టర్ చేసుకుని డెలివరీ పొందటం, ఫేక్ చిరునామాలు, ఫేక్ డాక్క్యూమెంట్స్ తో మభ్య పెట్టటం సహజంగా అందరూ చేసే తంతే కానీ ఈ వ్యవహారం చేసి దొరికింది ఒక సినిమా సెలబ్రిటీ కావటంతో ఆ వార్త చాలా ప్రత్యేకమై చానెల్స్ కి ఫీడింగ్ ఐయింది. ఈ పరిణామం లో దోషిగా చిక్కుకుని బలి ఐన కథానాయిక అమల పాల్ కేరళ ప్రత్యేక క్రైమ్ సిబ్బంది విచారణలో నేరం అంగీకరించిన సంగతి సర్వత్రా చర్చనీయాంశం ఐయింది.

అలా కేరళ ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది విచారణలో ఇచ్చిన వివరణ అనంతరం సామాజిక మాంద్యమాలలో అమల పాల్ తన అభిమానులతో తన అభిప్రాయం పంచుకుంటూ "మీ గురించి ఎవరు ఏమనుకున్నా, అపార్ధం చేసుకున్నా అది వారి వ్యక్తిగతానికే వదిలేయండి. మీ పని మీరు చేసుకుపోతూ మీ ప్రతిభని మీరు చాటుకుంటూ వుండండి. అదే మిమ్మల్ని శిఖరాలని చేరుస్తుంది." అంటూ నీతి బోధనలు చేస్తూ క్రైమ్ బ్రాంచ్ వారి విచారణ వ్యవాహారం పై పరోక్ష కామెంట్స్ చేస్తూ అమల ధ్వంధ్వ వైఖరి తో ఆశ్చర్యపరిచింది.

Similar News