హీరోకి, డైరెక్టర్ కి ఒకలాంటి నమ్మకమే

Update: 2018-03-28 11:00 GMT

మహేష్ బాబు హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. వీరి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా భరత్ అనే నేను సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ బోలెడంత క్రేజ్ ఉంది. మరెంతో హైప్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమా బోల్తా పడింది. స్పైడర్ సినిమా తెరకెక్కుతున్నప్పుడు మురుగదాస్ - మహేష్ కాంబో మీద భీభత్సమైన క్రేజ్ ఉంది. కానీ సినిమా విడుదలయ్యాక గాని అసలు రంగు బయటకు రాలేదు. కానీ మహేష్ గత రెండు సినిమాలు భారీ ప్లాప్ ని సొంతం చేసుకున్నాక కూడా భరత్ అనే నేను మీద భీభత్సమైన అంచనాలున్నాయి.

మరి కేవలం ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల్లోనే కాదండోయ్ .. అటు దర్శకుడు కొరటాల శివకి, ఇటు మహేష్ బాబుకి కూడా ఈ సినిమా విజయంపై బోలెడంత నమ్మకం ఉన్నట్లుగా కనబడుతుంది.... మహేష్ అండ్ కొరటాల వ్యవహారం చూస్తుంటే. మరి ఉండదూ, ఉంటుంది. కొరటాల ఎప్పుడూ సమాజానికి ఏదైనా మంచి జరగాలని ఒక మంచి మెస్సేజ్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ అందిస్తాడు. ఇప్పుడు కూడా మహేష్ బాబు ని మొదటిసారిగా భరత్ అనే నేను లో పవర్ ఫుల్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ సీఎం గా చూపించబోతున్నాడు.

మరి మొదటిసారి సీఎం లుక్ లో కనిపించబోతున్న మహేష్ బాబు కి.. కొరటాలకి ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే కొరటాల శివేమో నైజం ఏరియాలోని రైట్స్ ను సొంతం చేసుకోగా.... మహేష్ కూడా కొన్ని ప్రాంతాలలో థియేట్రికల్ రైట్స్ ను కొనేశాడనే టాక్ వినబడుతుంది. మరి ఏప్రిల్ 20 న విడుదల కాబోతున్న మహేష్ భరత్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని.. అలాగే సినిమా కూడా సూపర్ గా వచ్చిందని చిత్ర బృందం చెబుతున్న మాటలను బట్టి కొరటాల, మహేష్ కి కూడా ఎంత నమ్మకం లేకపోతె ఇలా థియేట్రికల్ రైట్స్ ని ఉంచేసుకుంటారు.

Similar News