హీరో అయినా క్యారెక్టర్ రోల్స్ వదలను

Update: 2016-11-16 12:46 GMT

బాగా బిజీ హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి కథ నాయకుడు అయ్యే క్రమంలో అప్పుడప్పుడు తన కాల్ షీట్లను సర్దుబాటు చేసుకునే ఎక్కువ సమయం ఒకే చిత్రంతో ప్రయాణం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో గీతాంజలి అనే హారర్ కామెడీ చిత్రం ద్వారా తొలి సారి కథానాయకుడుగా మారి విజయం పొందాడు. ఆ విజయంతో ఇతర నటులలాగా కేవలం కథానాయకుడిలానే కొనసాగాలనే నియమాలు పెట్టుకోకుండా అతనికి వున్న క్యారెక్టర్ రోల్స్ కమిట్మెంట్స్ చేస్తూనే మరో ఆహ్లాదకరమైన కథ దొరకడంతో మళ్లీ కథానాయకుడిగా అలరించటానికి తాపత్రయ పడుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి.

శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడిగా నటించిన జయమ్ము నిశ్చయంబు చిత్ర ప్రచార కార్యక్రమాలలో మీడియా మిత్రులతో ఆయన ముచ్చటిస్తూ గతంలో అఆ చిత్ర విజయానంతరం ఆయన సినీ మీడియా వారిపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన తప్పేనని మరోసారి పత్రికా ముఖంగా ఒప్పుకున్నారు. ఎవరో ఒక విలేకరి అఆ చిత్రంలో ఇద్దరు నటుల నటన పై విమర్శిస్తే శ్రీనివాస్ రెడ్డి మొత్తం మీడియా వారి పై ఆ ఆరోపణలు చేసి వివాదాల్లో ఇర్రుకున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు తానే కథానాయకుడిగా నటించిన చిత్రం కావటంతో మీడియా వారి సహాయ సహకారాలు కావాల్సి రావటంతో తన తప్పుని తాను మరో సారి ఒప్పుకున్నాడు.

జయమ్ము నిశ్చయమ్ము చిత్ర విడుదల తరువాత చెయ్యబోయే చిత్రాల గురించి ఒక వెలకరి వేసిన ప్రశ్నకు సమాధానంగా, "ఎట్టి పరిస్థితుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతాను. నేను ఈ స్థాయిలో ఉండటానికి దోహదపడినవి ఆ పాత్రలే. మళ్లీ ఇటువంటి మంచి కథలు వచ్చినప్పుడు కథానాయకుడిగాను మెప్పించే ప్రయత్నాలు చేస్తుంటాను." అని స్పష్టత ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి.

Similar News