హాలీవుడ్ తీరు బాగా ఒంటబట్టినట్టుంది అమ్మడికి

Update: 2016-12-28 20:00 GMT

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులకు ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా గత కొంత కాలం గా భారతీయ చిత్రాలకు దూరంగా ఉంటుంది. హాలీవుడ్ లో చేస్తున్న టెలి సిరీస్ తో పాటు హాలీవుడ్ సినిమా అవకాశం ఒకేసారి దక్కటంతో తన మకాం బొంబాయి నుంచి న్యూ యార్క్ కి మార్చేసింది అనే వార్తలు కూడా ప్రచారమయ్యాయి. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చిత్రీకరణ దశలో బిజీగా ఉండగానే ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన అస్సాం రాష్ట్ర పర్యాటక ప్రచారకర్తగా రెండు సంవత్సరాలు పాటు కొనసాగే అవకాశం దక్కటంతో అస్సాం ప్రభుత్వం ప్రతిపాదించిన అధికారిక ఒప్పందాన్ని సంతకం చేసింది ప్రియాంక చోప్రా. కాగా తాజాగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తమ పర్యాటక శాఖ సభ్యులతో పాటు ఉద్యోగులందరితో కలిపి ఒక కాన్ఫెరెన్స్ ఏర్పాటు చేయగా ప్రియాంక చోప్రా కూడా హాజరు ఐయ్యింది.

ఈ కాన్ఫెరెన్స్ అనంతరం మీడియా తో ముచ్చటించిన ప్రియాంక చోప్రా ను ఒక విలేకరి ఫెమినిజం పై తన అభిప్రాయాన్ని తెలుపమని కోరగా, "ఆడవారు ఏదైనా సాధించగలరు అని నమ్ముతాను. ప్రత్యేకించి ఫెమినిజం అని కాదు కానీ నేటి తరంలో అటువంటి తారతమ్యాలు తావు ఉండటం లేదు కదా. ఆడవారికి ఆ ఒక్క పనికి తప్ప మరే సమయంలోనూ మగవారి తోడు అవసరం అవ్వదు." అంటూ హాలీవుడ్ మాటలతో ఘాటుగా స్పందించి అందరిని ఆశ్చర్య పరిచింది.

ఇటీవల విడుదలైన బేవాచ్ తొలి ప్రచార చిత్రంలో ప్రియాంక చోప్రా కనిపించేది కేవలం క్షణాల నిడివి కూడా కాకపోవటంతో భారత దేశంలో అభిమానులు నిరాశ చెందారు అని గుర్తు చేయగా, "బేవాచ్ లో చాలా కీలకమైన పాత్రలోనే నటిస్తున్నాను. కేవలం టీజర్ తోనే అన్ని తెలిసిపోతే ఇక ట్రైలర్, సినిమా విడుదల సమయానికి ఆసక్తి ఎం మిగులుతుంది. రానున్న ట్రైలర్ మరియు సినిమా తో కచ్చితంగా నా అభిమానులు తృప్తి చెందుతారు." అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది ప్రియాంక చోప్రా.

Similar News